త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా పై సరికొత్త ప్లాన్ మరి నిజమా ?

త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా పై సరికొత్త ప్లాన్ మరి నిజమా ?

0
103

అగ్ర దర్శకులు ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో షూటింగులు లేకపోయినా తమ ఆలోచనలో ఉన్న కథలను మరింత తీర్చి దిద్ది కథలు ప్రిపేర్ చేసుకున్నారు, ఈ సమయంలో కొందరు హీరోలకు కథ వినిపించి స్టోరీ ఒకే చేసుకున్న వారు ఉన్నారు.

చాలా మంది హీరోలు ఈ లాక్ డౌన్ వేళ కథలు విన్నారు ..దాదాపు 15 సినిమాలు ఈ నాలుగు నెలల్లో ఒకే అయ్యాయి అని తెలుస్తోంది, ఇందులో 7 మంది స్టార్ హీరోలు ఈ కథలు ఒకే చేశారట, అయితే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30 సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. అంటే వచ్చే ఏడాది.

త్రివిక్రమ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలని చూస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు, ఇక తర్వాత లూపిఫర్ కూడా రీమేక్ చేయనున్నారు చిరు, అయితే చిరు లూసిఫర్ కి కాస్త బ్రేక్ ఇస్తే త్రివిక్రమ్ మెగాస్టార్ తో సినిమా చేస్తారు అని తెలుస్తోంది, దాదాపు తారక్ సినిమాకు ఇంకా 6 నెలల సమయం పట్టచ్చు అంటున్నారు.. ఈలోపు చిరు చిత్రం చేయచ్చని ఆలోచనలో ఉన్నారట గురూజీ, మరి ఈ టాక్ అయితే నడుస్తోంది టాలీవుడ్ లో.