త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పార్థు అనే పేరు ఎందుకు ఇష్టమో తెలుసా

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పార్థు అనే పేరు ఎందుకు ఇష్టమో తెలుసా

0
107

టాలీవుడ్ లో రచయితగా దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎంతో పేరు ఉంది, ఆయన సినిమాలు చాలా వరకూ ప్రేక్షకులని ఆలోచింపచేస్తాయి. అంతేకాదు యువతకు బంధాలకు కుటుంబాలకు కనెక్ట్ అయ్యే సినిమాలు తీస్తారు ఆయన… ఇక ఆయన స్పీచ్ కూడా అలా వినాలి అనిపిస్తుంది… ఇక ఆయన సినిమాలు అంటే కచ్చితంగా ఆమాటలు మాత్రం ఎలా ఉంటాయా అని చూస్తారు, అంత బాగా సంభాషణలు ఉంటాయి.

 

అలాంటి త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో ప్లాన్ చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకి పార్దు అనే టైటిల్ ఆలోచన చేస్తున్నారట… దీని గురించి వార్తలు అయితే టాలీవుడ్ లో రెండు రోజులుగా వినిపిస్తున్నాయి, అయితే పార్ధు అనగానే మనకు అతడు సినిమా గుర్తు వస్తుంది ..అందులో మహేశ్ బాబు పాత్ర పేరు పార్థు. అయితే ఈ పేరు అంటే త్రివిక్రమ్ కు చాలా ఇష్టం, అందుకే సినిమాలో ఈ పేరు పెట్టారు, ఇప్పుడు టైటిల్ పేరు ఇదే పెడతారు అని టాక్ నడుస్తోంది.

 

 

అయితే త్రివిక్రమ్ కు ఈ పేరు ఎందుకు ఇంత ఇష్టం అంటే, యద్దనపూడి సులోచనారాణి నవలలు అంటే త్రివిక్రమ కి చాలా ఇష్టం.. ఆ నవలల్లో పార్థు అనే నవల అంటే మరింత ఇష్టం.. అందుకే ఆయన ఈ పేరుని ఇంత ఇష్టపడ్డారట, అలా వచ్చిన ఇష్టంతో అతడు సినిమాలో ప్రిన్స్ కు ఆ పేరు పెట్టారు.. . మరి ఈ వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి, ఏది ఏమైనా ఆయన నుంచి అఫిషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.