త్రివిక్రమ్ తారక్ మూవీ ప్రారంభం ఎప్పుడు ఆ తేది ఫిక్స్ అయిందా ?

త్రివిక్రమ్ తారక్ మూవీ ప్రారంభం ఎప్పుడు ఆ తేది ఫిక్స్ అయిందా ?

0
90

ఈ లాక్ డౌన్ వేళ సినిమాలు అన్నీ నిలిచిపోయాయి, షూటింగులు జరిగి మూడు నెలలు అవుతోంది.. అయితే షూటింగులకి పర్మిషన్ ఇప్పుడు ఇవ్వడంతో సినిమాలు మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్నాయి, అందరికి ఉపాధి దొరకనుంది, అయితే కొందరు హీరోలు షూటింగులకి రెడీ అవుతుంటే మరికొందరు కొన్ని రోజులు ఆగుదాము అని అంటున్నారు.

ఇక తాజాగా చరణ్ తారక్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు, ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది అని తెలుస్తోంది.ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో నటించనున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి చిత్రం ప్రారంభం దసరాకి చేయాలని భావిస్తున్నారట.