నోయెల్ పై ట్రోలింగ్.. అవన్నీ నమ్మవద్దు అతడి సోదరుడు క్లారిటీ

-

బిగ్ బాస్ హౌస్ లో నోయెల్ తన తండ్రి గురించి చెప్పిన మాటలపై ఇప్పుడు నోయెల్ ని బిగ్ బాస్ అభిమానుల సోషల్ మీడియాలో పలు కామెంట్లు పెట్టి ఆడుకుంటున్నారు, భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు.. అంతేకాదు నోయెల్ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు, కావాలనే నీ స్వార్ధం కోసం నీ తండ్రి గురించి అబద్దం చెప్పి సానుభూతి పొందాలని చూస్తావా అని కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

రీసెంట్ గా హౌస్ మేట్స్ అందరూ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెబుతూ ఎమోషనల్ అయ్యారు.. అందరిలా తన కుటుంబం గురించి చెప్పాడు నోయెల్, నోయెల్ తన తల్లి ఇళ్లల్లో పని చేసేదని.. తండ్రి ఇస్త్రీ పని, కూలి పని ఇలా ఎన్నో చేస్తూ డబ్బులు సంపాదించేవాడని చెప్పాడు. అయితే ఇది నిజమా అని చాలా మంది వీకీపీడియా చెక్ చేస్తే, అతని తండ్రి
సామ్యూల్ రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని రాసి ఉంది. దీంతో నోయెల్ సింపతీ కోసం అబద్దాలు చెప్పాడంటూ విమర్శలు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు, అయితే దీనిపై అతని సోదరుడు క్లారిటీ ఇచ్చాడు.

నోయెల్ తమ్ముడు జోయెల్ క్లారిటీ ఇచ్చాడు. తన అన్నపై కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వికీపీడియాలో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ని ఎడిట్ చేసుకోవచ్చని తెలిపాడు.తమ తండ్రి ఇస్త్రీ పని చేసేవారని.. దానికి ప్రూఫ్ గా ఓ ఫోటోని షేర్ చేశారు. ఆ తరువాత డిఫెన్స్ రీసెర్చ్ లో జాబ్ రావడంతో అక్కడ జాయిన్ అయ్యారని చెప్పాడు.అది సెక్యూరిటీ ఉద్యోగం అని తెలిపాడు, జాబ్ ట్రైల్స్ లో ఉన్నప్పుడు ఇస్త్రీ పని చేసేవాడని క్లియర్ గా చెప్పాడని..తన అన్న గురించి తెలిపాడు నోయెల్ బ్రదర్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Allu Arjun | మరోసారి నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టుకు...

HMPV Virus | చైనాలో మరో ప్రాణాంతక వైరస్ కలకలం.. లక్షణాలు ఇవే

కోవిడ్ 19 తర్వాత డ్రాగన్ కంట్రీలో మరో కొత్త వైరస్ కలకలం...