20 ఏళ్ల పాటు శ్రీదేవి నేను మాట్లాడుకోలేదు – జయప్రద

20 ఏళ్ల పాటు శ్రీదేవి నేను మాట్లాడుకోలేదు - జయప్రద

0
132

అందాల తార శ్రీదేవి అగ్రహీరోయిన్ జయప్రద అంటే తెలుగువారికి ఎంత ఇష్టమో తెలిసిందే.. ఇటు తెలుగు తమిళంలోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా వీరిద్దరు సినిమాల్లో నటించారు.. ఇద్దరూ అగ్రహీరోయిన్లుగా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు.. అయితే శ్రీదేవి కొన్ని సంవత్సరాల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే… ఇక అలనాటి అందాల తార జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

 

ఇండియన్ ఐడల్ 12 కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద శ్రీదేవికి తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడారు..20 ఏళ్ల పాటు ఇద్దరూ చిత్ర సీమలో పోటీ పడి మరీ నటించారు, అయితే సినిమాల్లో మాట్లాడుకోవడమే కానీ బయట మాత్రం అస్సలు మాట్లాడుకునేవారు కాదట, సినిమా షూటింగు సమయంలో యాక్షన్ అనగానే మాట్లాడేవారు, ఇక కట్ అనగానే ఇక ఎవరి పని వారిది అస్సలు మాట్లాడుకునే వారు కాదట.

 

రియల్ లైఫ్ లో తాము పెద్ద మాట్లాడుకోలేదు అని తెలిపారు ఆమె, ఓసారి బాలీవుడ్ స్టార్స్ రాజేశ్ ఖన్నా, జితేంద్ర.. షూటింగ్ సమయంలో మేకప్ రూమ్లో ఇద్దరిని ఉంచి గంటపాటు తాళం వేశారట. అయినా ఎవరి పని వారు చూసుకున్నాం కాని మాట్లాడుకోలేదు అని తెలిపారు ఆమె…అయితే శ్రీదేవి మరణించింది అని తెలియగానే చాలా బాధపడ్డాను అని తెలిపారు జయప్రద.