సురేఖ కొనిదేల పేరుతో ట్విట్ట‌ర్ ఖాతా..ఫేక్ ఖాతా అంటూ మెగా ఫ్యాన్స్ ఫోస్టు

0
99

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కష్టపడే తత్వాన్ని అప్పట్లోనే గుర్తించిన అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేశాడు. ఎప్పటికి అభిమానాలకు సోషల్ మీడియా ద్వారా దగ్గరగా వుంటారు చిరంజీవి. తాజాగాఆయన భార్య సురేఖ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టింది.

ప్ర‌ముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విట్ట‌ర్ లో సురేఖ చిరంజీవి ఖాతా తెరిచింది. సురేఖ కొనిదేల అనే పేరుతో ఖాతాను ఓపెన్ చేసింది. అందులో మొద‌టి పోస్టు..త‌న కుమారుడు అయినటువంటి మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి ఉన్న ఫోటోను పోస్టు చేసింది. ట్విట్ట‌ర్ లో చేరడం సంతోషంగా ఉంద‌ని సురేఖ  రాసుకువ‌చ్చింది. అలాగే త‌న మొద‌టి పోస్టు..సూప‌ర్ స్టైలీష్ గా ఉండే త‌న కుమారుడు రామ్ చరణ్  తో  అని క్యాప్షన్ రాసింది.

అయితే ఈ ఖాతా ఫేక్ అని మెగా అభిమానులు తేల్చి చెప్పారు. కామెంట్స్ లో కూడా ఫేక్ ఖాతా అని మెగా ఫ్యాన్స్ ఫోస్టు చేస్తున్నారు. అలాగే యూజ‌ర్ నేమ్ స్పెల్లింగ్ కూడా త‌ప్పుగా ఉంద‌ని.. ఇది ఫేక్ ఖాతా అని అంటున్నారు. KONIDELA అని ఉంటుంది.. కానీ ఈ యూజ‌ర్ నేమ్ లో SUREKHA KONIDALA అని ఉంద‌ని కామెంట్స్ పెడుతున్నారు. ఇలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సైబ‌ర్ క్రైం కు మెగా అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనివల్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.