రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకుంటూ ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు.
తాజాగా విరాటపర్వం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మనముందుకొస్తున్నాడు. విరాటపర్వం గతేడాది ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ కరోనా మహమ్మారి కారంణంగా అన్ని సినిమాలలాగే ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో మనకు విభిన్న పాత్రలో కనబడనుండగా..సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.
ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే శుభవార్త చెప్పింది చిత్రబృందం. అప్పటికప్పుడు జులై 1న సినిమాని విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. కానీ తాజాగా ఆ తేదీని మారుస్తూ.. మరింత ముందుగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపి అటు దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటూ సాయి పల్లవి అభిమానులను సంతోష పరిచారు. జూన్ 17న థియేటర్లలో ‘విరాట పర్వం’ మూవీ సందడి మొదలు కానుంది.