ఈ వేసవిలో సినిమాల సందడి మాములుగా లేదు.. అయితే తాజాగా బాలయ్య అభిమానులకి కూడా గుడ్ న్యూస్ రాబోతోంది అని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి… అయితే బాలయ్య బోయపాటి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది.. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది… అయితే ఈ మాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సింహా .. లెజెండ్ సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి.. దానిని మించి ఈ సినిమా ఉంటుంది అని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ ఏమిటి అనేది మాత్రం రివీల్ కాలేదు… ఇక బాలయ్య సినిమాల విషయంలో విలన్ అలాగే టైటిల్ అనేది చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి… అయితే బోయపాటి ఎలాంటి టైటిల్ పెడతారు అనేదానిపై అభిమానులు తెగ ఆలోచన చేస్తున్నారు.
తాజాగా ఓ న్యూస్ వినిపిస్తోంది…ఉగాదికి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేశారు..మే 28వ తేదీన విడుదల చేయనున్నారు చిత్రాన్ని.. ఈ టైటిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, చూడాలి ఉగాదికి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతారా లేదా అనేది.