ఉగాదికి బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా

ఉగాదికి బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా

0
84

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో సినిమా రాబోతోంది.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, అయితే ఈ సినిమా పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు బోయపాటి… ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ కూడా చెప్పలేదు… అయితే ఇందులో బాలయ్య రెండు రోల్స్ చేస్తున్నారట, ఇప్పటి వరకూ కనిపించని పాత్రలో బాలయ్యని చూపిస్తున్నారు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

 

 

బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కొంతసేపు అఘోరా గెటప్ లో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఉగాది సందర్భంగా ఈ పాత్ర రివీల్ చేయనున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది.. అయితే ఉగాది రోజు కచ్చితంగా ఈరెండిటిలో ఏదో ఒకటి అనౌన్స్ ఉంటుంది అంటున్నారు.

 

లేకపోతే రెండూ ఉండవచ్చు అంటున్నారు, అయితే ఈ సినిమా గురించి అందరూ ఎదురుచూస్తున్నారు, దర్శకుడు బోయపాటిని కూడా అడుగుతున్నారు అభిమానులు.. ఎప్పుడు మా బాలయ్య బాబు సినిమా టైటిల్ చెబుతారు అని.. సో ఇక ఉగాది దీనికి మంచి ముహూర్తం అని చిత్ర యూనిట్ భావిస్తోందట….ఉగాది రోజున టైటిల్ పోస్టర్ అలాగే బాలయ్య లుక్ రివీల్ చేస్తే చూడాలి అని భావిస్తున్నారు ఫ్యాన్స్.