జగన్ కు ఉండవల్లి మూడు సలహాలు

జగన్ కు ఉండవల్లి మూడు సలహాలు

0
102

జగన్ మోహన్ రెడ్డి పరిపాలన అద్బుతంగా లేదని… అలా అని వ్యతిరేకంగాలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు జగన్ మోహన్ రెడ్డి స్వయం కృషితోనే సాధించుకున్నారని అన్నారు…

జగన్ వందరోజులు పాలనలో విద్యుత్ కోత మైనస్ అని అన్నారు. అలాగు ఇసుక కొరత కూడా మైనస్ అని తెలిపారు రానున్న రోజుల్లో ఇసుక విధానం సక్సెస్ అవుతుందని భావిద్దామని ఉండవల్లి అన్నారు… జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు రావడానికి ప్రధాన కారణం విద్యుత్ కొరత అని అన్నారు..

గ్రామ సచివలాయ ఐడియా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వచ్చిందని అన్నారు… జగన్ పరిపాలనపసై కామెంట్స్ చేయడానికి కొంత సమయం పడుతుందని ఉండవల్లి అన్నారు… రానున్న రోజుల్లోజగన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నవరత్నాల అమలు విషయంలో తేడా వస్తే వేసీపీ కార్యకర్తలే తిరగబడతారని తెలిపారు..