బాలయ్య అభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకం..కొత్త సినిమాలోని డైలాగ్​ లీక్!

Unforgettable memory for Balayya fans..Dialogue leak in new movie!

0
115

బాలయ్య సినిమా అంటే అదిరిపోయే డైలాగ్​లు ఫైట్లు ఉంటాయి. ప్రత్యేకంగా డైలాగ్స్​ కోసమే థియేటర్​కు వెళ్లేవాళ్లు చాలా మంది. 2021 చివర్లో ‘అఖండ’ అంటూ థియేటర్లలోకి వచ్చిన బాలయ్య.. తెగ సందడి చేశారు.

ప్రస్తుతం బాలకృష్ణ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ‘క్రాక్’ సినిమా సాలిడ్​ హిట్​ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ డైలాగ్​ను స్వయంగా డైరెక్టర్ గోపీచంద్ రివీల్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు.

ఆహా’ ఓటీటీలో బాలయ్య హోస్ట్​గా వ్యవహరిస్తున్న ‘అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే’ టాక్​షోకు హీరో రవితేజ గెస్ట్​గా వచ్చిన ఎపిసోడ్.. డిసెంబరు 31న విడుదలైంది. అదే ఎపిసోడ్​లో రవితేజతో మూడు సినిమాలు తీసి హిట్​లు కొట్టిన గోపీచంద్ మలనేని కూడా తళుక్కున మెరిశారు. ఈ క్రమంలోనే మాటలమధ్యలో తనతో చేయబోయే సినిమాలోని ఏదైనా ఓ డైలాగ్​ను చెప్పమన్నారు.

“రేయ్ రోడ్డు మీదకి జింక లేదా గొర్రె వచ్చిందనుకో ఎవడైనా హారన్ కొడతాడు. అదే సింహం వచ్చిందంటే హారన్ కాదు కదా ఇంజిన్ కూడా ఆపేసి సైలెంట్​గా కూర్చుంటాడు. అక్కడున్నది సింహం రారేయ్” అంటూ సినిమాలోని బాలయ్య క్యారక్టరైజేషన్​కు సంబంధించిన ఓ డైలాగ్​ను రివీల్ చేశారు.