టాలీవుడ్ లో కుర్రకారుకి తెగ నచ్చే హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు, అద్బుతమైన చిత్రాలు చేసింది.. అగ్రహీరోలతో ఆమె నటించింది, ఆమె ముంబై నటి, ఆమె తెలుగులో చేసిన ఫస్ట్ చిత్రం యువకుడు.
తెలుగు నుంచి తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. భూమికకు మిస్సమ్మ సినిమాకి ఉత్తమ నటిగా నంది పురస్కారం వరించింది.
ఆగస్టు 21, 1978 లో ఢిల్లీలో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది. ఆమె మోడలింగ్ రంగంలో ముందు అడుగుపెట్టింది, ఆమె తండ్రి అన్న ఇద్దరు సైన్యంలో పనిచేసేవారు,పాండ్స్ పౌడర్ యాడ్ లో కూడా ఆమె కనిపించింది.ఇక యోగా గురువైన భరత్ ఠాకూర్ ను 2007 లో ఆమె వివాహం చేసుకుంది.
భూమిక చావ్లా నటించిన సినిమాలు
యువకుడు
ఖుషీ
మిస్సమ్మ
సింహాద్రి
వాసు
ఒక్కడు
స్వాగతం
అనసూయ
కలెక్టర్ గారి భార్య
మల్లెపూవు
సత్యభామ
మాయాబజార్
జై చిరంజీవ
లడ్డు బాబు
ఎంసిఎ
రూలర్