యూట్యూబ్ ఛానల్స్ పై అనసూయ ఫైర్..

0
93

యూట్యూబ్​ ఛానల్స్​పై యాంకర్​ అనసూయ భరద్వాజ్​ మండిపడ్డారు. తనను సంప్రదించకుండా తనపై తప్పుడు వార్తలు రాసే వాళ్లపై కోర్టుకెళతానని స్పష్టం చేశారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలుత ఆమె విజయం సాధించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మరుసటి రోజుకు వాయిదా వేయడం వల్ల ఆమె ఫలితంపై సందిగ్ధత నెలకొంది. మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీనిపై అనసూయ కూడా వ్యంగ్యంగా ట్వీట్‌ పెట్టారు.

నేను మెజార్టీలో ఉన్నానని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. నేను మీడియాలో ఉంటే న్యూస్‌ రిపోర్ట్‌ చేయడాన్ని ఎంచుకుంటాను. క్రియేట్‌ చేయను. గాలి వార్తలు చెప్పను. కచ్చితంగా ఎన్నికల అధికారులు ప్రకటిస్తేనే చెబుతాను. ఓట్ల లెక్కింపు దగ్గర ఎవరో ఇచ్చిన సమాచారాన్ని నేను నమ్మను. ‘మా’ ఎన్నికల్లో గెలిచి ఉంటే, మరింత సర్వీస్‌ చేసేదాన్ని.

ఇప్పుడు కూడా సమయం ఉంటే తప్పకుండా చేస్తా. గెలుపోటములు పట్టించుకోను. వరుస షూటింగ్‌ల కారణంగా గత 40 రోజులుగా సరిగా ఇంటికి వెళ్లలేకపోయాను. పని నుంచి నేరుగా వచ్చి ఓటేశాను. నా గురించి తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తా” అని అనసూయ అన్నారు.