ఉపాసన చెల్లెలు అనుష్పాల పెళ్లి – వరుడు ఎవరంటే

Upasana's younger sister Anushpala wedding - who is the groom

0
415

రామ్ చరణ్ భార్య ఉపాసన చెల్లెలు అనుష్పాల త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. అథ్లెట్ అర్మన్ ఇబ్రహీంతో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె, అతడిని త్వరలో వివాహం చేసుకోనున్నారు. వీరికి నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ జంట ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఉపాసన ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ నా డార్లింగ్ కు అభినందనలు అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోని చూసిన అందరూ కొత్త జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరంటే? మాజీ ఇండియన్ ఎఫ్-3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం తనయుడు అర్మన్ ఇబ్రహీం.

Arman Ibrahim Car Racer

ఇతను కార్ రేసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అనుష్పాల అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావుల మనవరాలు. శోభన- అనిల్ కామినేనిల కూతురు. ఈ జంటకి అందరూ విషెస్ తెలియచేస్తున్నారు.

https://www.instagram.com/p/CRbc-6tLk8d/

https://www.instagram.com/p/B0fDFWpFYBv/