సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.ఇంతకుముందు ప్రీ లుక్‌లో మత్స్య కారుడి గెటప్‌లో మాస్‌గా కనిపించిన వైష్ణవ్ తేజ్ ఈ లుక్‌లో మోడ్రన్‌గా కనిపించాడు. సుకుమార్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. విలేజ్ డ్రామాగతెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ లుక్, నటన ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కు జంటగా కృతి శెట్టి నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా, ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.