ఒదినతో కార్తీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే

ఒదినతో కార్తీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే

0
105

తమిళ్ నేటివిటీ సినిమాలు తెలుగు ప్రేక్షకులని కూడా అలరిస్తున్నాయి.. మరీ ముఖ్యంగా తెలుగులో లైన్ సినిమాలు తమిళ్ లో రీమేక్ అవుతున్నాయి. అలాగే తమిళ్ సినిమాలు కూడా తెలుగులో రీమేక్ అవుతున్నాయి.. తాజాగా ఖైదీ ఘన విజయం తెలిసిందే. కార్తీ నటనకు అందరూ ఫిదా అయ్యారు.

ఇక తాజగా ఆయన మరో చిత్రం చేశారు.. అదే దొంగ…ఆయనకు అక్క పాత్రలో నిజ జీవితంలో వదిన అయిన జ్యోతిక నటించారు, కీలక పాత్రలో సత్యరాజ్ కూడా కార్తీతో నటించారు..ఇక ఈ సినిమాని జీతూ జోసెఫ్ డైరెక్షన్ చేశారు.. మరో పది రోజుల్లో అంటే ఈ నెల 20న సినిమా విడుదల చేయనుంది చిత్ర యూనిట్.

ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మరో ఖైదీలా ఈ సినిమా హిట్ అవుతుంది అంటున్నారు ఆయన అభిమానులు