వకీల్ సాబ్ సినిమాకి మంచి టాక్ వచ్చింది.. సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది.. దీంతో బయ్యర్లు కూడా చాలా ఆనందంలో ఉన్నారు…ఇక అభిమానులు పండుగ చేసుకుంటున్నారు, అయితే తొలిరోజు కలెక్షన్లపై ఇంకా బయటకు లెక్కలు రాలేదు.. కాని టాలీవుడ్ వార్తల ప్రకారం దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లు వసూలు అయి ఉంటుంది అంటున్నారు, ఇక ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం 33 కోట్ల వరకూ రావచ్చు అని అంటున్నారు… గత సినిమాల కంటే ఇది రికార్డు అంటున్నారు ఆయన అభిమానులు.
పవన్ గత సినిమాలు అజ్ఞాతవాసి కాటమరాయుడు, సర్దార్ గబ్బర్సింగ్తో పోలిస్తే ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి,
అజ్ఞాతవాసి తొలిరోజు కలెక్షన్లు 27 కోట్లు
కాటమరాయుడు 22 కోట్లు
సర్దార్ గబ్బర్సింగ్ 21 కోట్లు
వచ్చాయి అయితే దీనికి 40 కోట్లు రావడంతో నాన్ బాహుబలి రికార్డులు తిరగరాస్తుందని భావిస్తున్నారు ఇక ఈ వారం వీకెండ్స్ రెండు రోజులు దాదాపు మరో 60 కోట్లు రావచ్చు అని సుమారు మూడు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు రావచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు.