వకీల్ సాబ్ సినిమా నిడివి ఎంతో తెలుసా

వకీల్ సాబ్ సినిమా నిడివి ఎంతో తెలుసా

0
83

పవన్ కల్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు..ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తుండడంతో ఈ సినిమా వెండి తెరపై ఎప్పుడు చూద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు, అయితే ఇక ట్రైలర్ కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ గురించే అందరూ చర్చ… ఇక ఈ సినిమాని హిందీలో సక్సస్ అయిన

పింక్ ఆధారంగా తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించారు.

 

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించారు, ఇక మూడు ప్రధాన పాత్రల్లో

అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు, ఈ సినిమాకి సెన్సార్ పూర్తయింది… ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది.అయితే ఈ సినిమా నిడివి ఎంత సేపు అనేది వార్తలు వస్తున్నాయి.

 

ఈ చిత్రం రన్ టైమ్ ఎక్కువే ఉందట.. 154 నిమిషాల రన్ టైమ్ వచ్చిందట. మొత్తానికి ఎక్కువ సేపు మా హీరోని తెరపై చూడవచ్చు అని ఆనందంలో ఉన్నారు ఈ వార్త తెలిసిన తర్వాత అభిమానులు… ఏప్రిల్ 9న థియేటర్ల దగ్గర ఇక అభిమానుల హడావిడి ఎలా ఉంటుందో తెలిసిందే.