వకీల్ సాబ్ కు షూటింగ్ కు ప్లేస్ దొరికేసింది…

వకీల్ సాబ్ కు షూటింగ్ కు ప్లేస్ దొరికేసింది...

0
101

కరోనా కారణంగా చిత్ర షూటింగ్ లన్నీ బంద్ అయిన సంగతి తెలిసిందే.. దీంతో ఇండస్ట్రీ అర్థికంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే… ఇటీవలే షూటింగ్ కు పర్మీషన్స్ రావడంతో నిర్మాణంలో ఉన్న చిత్రాలను మెల్లగా ప్రారంభిస్తున్నారు…

ఇదే క్రమంలో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్నాడు కాబ్టటి ఆయన లేకుండా కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో షూట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు… కరోనాకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ 70 శాతం పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే… ఇక మిగిలిన షూటింగ్ ను ఇప్పుడు స్టార్ట్ చేశారు… ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకుకానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట..