వకీల్ సాబ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే, ఇక ఇందులో అందరి నటన అద్బుతం అనే చెప్పాలి, ముఖ్యంగా ఇప్పుడు అందరూ కోర్టు సన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నారు.. కోర్టు సన్నివేశాలలో పోలీస్ ఆఫీసర్ అయిన సరళాదేవిని పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు అడుగుతారు.
ఆల్వాల్ లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి 15 నిమిషాల్లో వచ్చారా అమ్మా అని అడుగుతారు వకీల్ సాబ్, వెంటనే ఆమె షాక్ అవుతుంది, ఇక సంఘటన జరిగినాక జెట్ స్పీడ్ లో వచ్చినా సార్ అని చెబుతుంది, దీంతో వావ్
ఆమెకి సూపర్ స్పీడ్ ఉమెన్ సరళాదేవి అనే ఓ బిరుదు ఇస్తాడు వకీల్ సాబ్. ఇది అందరికి ఎంతో నచ్చుతుంది.
అయితే ఆమె గురించి తెలుసుకుంటే ఆమె బుల్లితెరలో చాలా పేరు సంపాదించిన నటి.. ఆమె పేరు లిరిష. బుల్లితెర పైన అమ్మనా కోడలా, అక్క చెల్లెల్లు వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అనేక పాత్రలు చేశారు ఆమె విలన్ అక్క వదిన ఇలా అనేక రోల్స్ లో అద్బుతంగా నటించారు….లిరిషా కూనపరెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఈ దంపతులకి ఓ బాబు ఉన్నాడు. ఆమె స్టాలిన్ సినిమాలో కూడా నటించారు, ఇక సునీల్ ని వివాహం చేసుకునే పాత్ర చేశారు ఆమె, ఇక ఈ సినిమా తర్వాత ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయి అని టాలీవుడ్ లో అంటున్నారు.