వకీల్ సాబ్ మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్…

వకీల్ సాబ్ మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్...

0
119

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… బాలీవుడ్ సూపర్ హిట్ అయిన పింక్ మూవీ చేస్తున్నాడు పవన్… ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సగానిపై గా షూటింగ్ పూర్తి చేసుకుంది… అన్ని బాగుంటే ఈ నెలలో పవన్ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ కావల్సి ఉంది… కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది…

ఈ సినిమా పూర్తి కాకముందే మలయాళ చిత్రం రీమేక్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది… గత ఏడాది వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది… సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది…

పృథ్వీరాజ్ అలాగే సూరజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం పలు ప్రశంశలు కూడా పొందింది.. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం రామ్ చరణ్ పోటీ పడి దక్కించుకుంటున్నాడట… ఇప్పటికే మలయాళ లూసీఫర్ రైట్స్ దక్కించుకున్న చరణ్… డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ మూవీ రైట్స్ ను సొంతం చేసుకుని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బాబాయ్ తో సినిమా తీయాలని చూస్తున్నారట… ఇక పవన్ నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు వచ్చాయని అంటున్నారు..