పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం రీలీజ్ అయింది.. మంచి టాక్ తెచ్చుకుంది.. వరల్డ్ వైడ్ బొమ్మ అదిరింది అనే టాక్ వచ్చింది…అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.. మూడున్నర సంవత్సరాల తర్వాత మా దేవుడు సినిమా వచ్చింది అంటున్నారు….మొత్తానికి రెండు షోలకు మంచి టాక్ వచ్చింది… అయితే పింక్ సినిమా రీమేక్ గా వచ్చినా ఇందులో కొన్ని కొత్త అంశాలు జోడించి అద్బుతంగా తీశారు దర్శకుడు వేణు శ్రీరామ్..
ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి, ఇక సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేశారు..ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలను వేణు శ్రీరామ్ పంచుకున్నారు.. అయితే ఆయన పవన్ కల్యాణ్ అభిమాని అనే విషయం తెలిసిందే.. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన తెలియచేశారు.
ఒకవేళ పవన్ కల్యాణ్ గారు ఈ సినిమా చేయనని అంటే, అప్పుడు ఈ కథ కోసం ఏ హీరోను ఎంచుకునేవారు అనే ప్రశ్నకు దర్శకుడు స్పందిస్తూ, కింగ్ నాగార్జున గారికి ఎంచుకునే వాడిని ఆయన తెలిపారు, అయితే నాగార్జున గారు కొత్త కథలు కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అనే విషయాన్ని చెప్పారు. సో మొత్తానికి సినిమా అయితే సూపర్ సక్సెస్ తో హిట్ టాక్ తెచ్చుకుంది.