వకీల్ సాబ్ ఓటీటీ విడుదల పై క్లారిటీ — అసలు నిజం ఇది

వకీల్ సాబ్ ఓటీటీ విడుదల పై క్లారిటీ --- అసలు నిజం ఇది

0
139

కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్దితి, అయితే సినిమా పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది, భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, ముఖ్యంగా థియేటర్లకు రావడానికి కూడా కొంత మంది జంకుతున్నారు, అయితే ఏపీలో తెలంగాణలో మాత్రం వకీల్ సాబ్ మేనియా నడుస్తోంది,ఆయన అభిమానులతో పాటు ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో వకీల్ సాబ్ సినిమా చూసేందుకు వస్తున్నారు.

 

 

సినిమా వసూళ్లల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పోడం ఖాయంగా కనిపిస్తోంది.. అయితే తాజాగా రెండు రోజులుగా ఓ వార్త వినిపిస్తోంది, ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తుంది అని ఈ వార్త , అయితే దీనిని అభిమానులు కొట్టిపారేశారు, ఇంత బాగా థియేటర్లకు జనాలు వస్తుంటే అప్పుడే ఓటీటీలో ఏమిటి అని షాక్ అయ్యారు అసలు నమ్మలేదు.

 

మొత్తానికి దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది, ఈ సినిమాని అప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయం, ఇంకా ఎలాంటి డీల్ లేదు అని తెలియచేశారట, అయితే ఇలా జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తెలిపారు..

సినిమా ఏప్రిల్ 23న ఓటీటీలో విడుదల కానుందని డేట్ కూడా ఫిక్స్ చేశారు అని వార్తలు వైరల్ అయ్యాయి, ఇదంతా ఉత్తి అబద్దం అని తెలిపారు, సో ఇలాంటి వార్తలు నమ్మకండి అంటున్నారు అభిమానులు.