దేశంలో రెండు నెలలుగా లాక్ డౌన్ అమలు అవుతోంది, ఈ సమయంలో వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం శ్రామిక్ రైల్స్ బస్సులు ఏర్పాటు చేసింది.. కాని కొందరు కాలి నడకన వెళుతున్నారు, వారిని చూసి ప్రజలు కూడా కన్నీరు పెట్టుకునే పరిస్దితి, వారికి కొందరు ఆహరం అందిస్తుంటే మరికొందరు వారికి ప్రైవేట్ రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇప్పటికే సినీ నటుడు సోనుసూద్ ఇలాంటి సాయం చేసి వలస కార్మికుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పంపించారు, తాజాగా బిగ్ బి అమితాబ్ ముంబై నగరంలో నివాసం ఉంటున్న వలస కార్మికులని ఉత్తర ప్రదేశ్కి పంపేందుకు 10 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
ముంబై నగరం నుంచి 43 మంది మంది పిల్లలు, 225 మంది వలసకార్మికులతో వెళుతున్న 10 బస్సులకు పచ్చజెండా ఊపి వీడ్కోలు పలికారు. దీంతో వారు అందరూ బిగ్ బీకి ధన్యవాదాలు తెలిపారు, వారి బాధలు చూసి చలించిన ఆయన ఈ ఏర్పాట్లు చేశారు.. ఈ బస్సులు ప్రయాగరాజ్, గోరఖ్ పూర్, భదోయ్, లక్నో ప్రాంతాలకు వెళతాయని చెప్పారు వారు…ఈ బస్సు ప్రయాణం చేస్తున్న వలసకార్మికులకు మాస్క్ లు, శానిటైజర్లు, గ్లోవ్స్, వాటర్ బాటిళ్లు, ఆహారప్యాకెట్లు, పళ్లరసాలు, గ్లూకోజ్, మందుల కిట్ ను అందించారు.