వరుణ్ తేజ్ కలెక్షన్స్ కుమ్మేశాడు ఎంతో తెలుసా ?

వరుణ్ తేజ్ కలెక్షన్స్ కుమ్మేశాడు ఎంతో తెలుసా ?

0
91

వరుణ్ తేజ్ హీరో గా నటించిన గడ్డలకొండ గణేష్ గత శుక్రవారం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. కాగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. డుదలకు ఒకరోజు ముందు టైటిల్ చేంజ్ అయినా వసూళ్లలో మాత్రం సత్తాచాటింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు ఏకంగా 5 కోట్ల 50 లక్షలు వసూళ్లు సాధించి అందరిని అబ్బురపరిచిన గద్దలకొండ గణేష్ రెండో రోజు కూడా 3.45 కోట్లు రాబట్టాడు. దీంతో రెండు రోజులకు గాను 9 కోట్ల మార్క్ టచ్ చేసింది.తొలి రోజే బొమ్మ హిట్టు అంటూ ప్రేక్షకులు,వరుణ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న జిగర్తాండ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. వరుణ్ తేజ్‌ సరసన పూజా హెగ్డే జంటగా నటించారు. వరుణ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా కాగా హరీష్ శంకర్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి. దీంతో ఇప్పట్లో బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్ల జోరు తగ్గేలా లేదు.