వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు గురువారం టవర్స్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ టైటిల్ మార్చాలని కోరుతూ బోయలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాల్మీకి బోయల తోపాటు హిందువుల ఆరాధ్య దైవం అని పేర్కొన్నారు. అలాంటి మహా దేవుడి పేరుమీద సినిమా తీయడం సరైంది కాదని, వారు వెంటనే సినిమా పేరు మార్చాలని బజరంగ్ దల్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ డిమాండ్ చేశారు.ఈ మేరకు వారు సెన్సార్ బోర్డు చైర్మన్ కు రాసిన లేఖను విడుదల చేశారు.