వంశీ మరో కథ – మహేష్ గ్రీన్ సిగ్నల్

వంశీ మరో కథ - మహేష్ గ్రీన్ సిగ్నల్

0
88

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రిన్స్ మహేష్ బాబు, అయితే ఈ సినిమా తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు మరో సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు, అయితే రెండు నెలలు అవుతోంది మరి ఇంకా ప్రిన్స్ ఏం ఆలోచన చేస్తున్నారు అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు, ముందు
వంశీ పైడిపల్లితో సినిమా చేస్తారు అని అనుకున్నారు.

కాని ఆ లైన్ నచ్చక స్టోరీలో కొన్ని కాన్సెప్ట్ లు మార్చాలి అని చెప్పారు ప్రిన్స్… ఆ పనిలో ఉన్నారు వంశీ.. అయితే మరోసారి కథ వినిపించినా ఇంకా మార్చాలి అని చెప్పారు మహేష్… దీంతో ఇక ఈ సినిమా ముందుకు వెళ్లదు అని అందరూ భావించారు, కాని తాజాగా మరో వార్త వినిపిస్తోంది.

వంశీ పైడిపల్లి మాత్రం జరిగిన దానికి డీలా పడిపోకుండా, మరో లైన్ ను రెడీ చేసి, మహేశ్ బాబుకి వినిపించాడట. ఆయనకి లైన్ నచ్చేసి ఓకే అనడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. అయితే ఈ కధ వేరే లైన్ అని తెలుస్తోంది, దీంతో వంశీకి లైన్ క్లియర్ చేశారట మహేష్ , అయితే వంశీ స్టోరీ ఒకే కాకపోతే పరశురామ్ తో సినిమా చేస్తారు అని వార్తలు వచ్చాయి, ఆయన బీజీగా ఉండటంతో ఇప్పుడు ప్రిన్స్ వంశీ కథతో ముందుకు వెళ్లాలి అని అనుకుంటున్నారు. ఇక ఈ కథ రాసే పనిలో ఉన్నారు వంశీ.