బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi Sarath Kumar in the movie Gopichand Malineni- Balakrishna

0
136

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఈసినిమా గురించి బాలయ్య అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. అఖండ చిత్రం పూర్తి అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించనున్నారు బాలయ్య. అయితే ఇప్పుడు పలు తెలుగు తమిళ చిత్రాల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ అద్భుతమైన పాత్రలు చేస్తున్నారు. ప్రతీ సినిమాకి ఆమె ప్రశంసలు అందుకుంటున్నారు.

విలన్ గా ఆమె పాత్రలు చాలా బాగుంటున్నాయి. అయితే బాలయ్య సినిమాలో కూడా ఆమెకి ఓ పవర్ ఫుల్ రోల్ ఉంటుందని చిత్రబృందం స్పష్టం చేసింది. క్రాక్ తర్వాత నాకెంతో ఇష్టమైన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య సినిమా కోసం పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపింది ఆమె.

ఈ సినిమాలో బాలయ్య ఫుల్ మాస్, పవర్ఫుల్ లుక్లో అలరించనున్నారట. అంతేకాదు ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమా నిర్మిస్తోంది. ఇక క్రాక్ లో జయమ్మ పాత్ర అందరికి నచ్చింది. అయితే ఈ సినిమాలో ఆమె చేసే రోల్ ఏమై ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. .