ఉగాది సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ “వర ఐపీఎస్” ఫస్ట్ లుక్ విడుదల..!!

-

క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. లేడీ ప్రధానమైన పాత్రలు ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘వర ఐపీఎస్’. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర బృందం. తలైవసల్ విజయ్, రవి కాలే, సుమిత్ర, భరత్ రెడ్డి తదితరులు నటించారు. శ్రీ లలితాంబికా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ వారు దక్కించుకున్నారు.

- Advertisement -

శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ అధినేత ఏ ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తుండగా ఈ రోజు విడుదలైన పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్ సినిమాపై  అంచనాలను పెంచింది. ఒరేయ్ బామ్మర్ది వంటి విజయవంతమైన సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ నుంచి మరో ఆసక్తి పరిచే సినిమా రావడం విశేషం. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ ఐపీఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కి జగదీష్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా కేజీఎఫ్ లాంటి భారీ సినిమాకి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మాథ్యూస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు

వరలక్ష్మి శరత్ కుమార్, తలైవసల్ విజయ్, రవి కాలే, సుమిత్ర, భరత్ రెడ్డి, బ్లాక్ పాండి, రాజేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు

బ్యానర్ :  శ్రీ లలితాంబికా ప్రొడక్షన్, శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ విడుదల :  ఏ ఎన్ బాలాజీ
దర్శకుడు : జేకే
DOP:  మాథ్యూస్
మ్యూజిక్: రవి బస్రూర్
ఎడిటర్: వెంకీ యూ.డీ.వీ
ఫైట్స్ : జాలీ బాస్టియన్, సిరుతై గణేష్
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...