కరోనా వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీ పై పడటంతో షూటింగ్ లు నిలిచిపోయాయి… ఇక విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను వాయిదా వేసుకున్నారు… దీంతో ఆడియన్స్ ఇండస్ట్రీ అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు…
తాజాగా నందమూరి బాలకృష్ణపై ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది… మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి…
ఈ చిత్రంలో బాలయ్య, దగ్గుబాటి రానాలు నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది… అయితే ఇప్పటికే కమిట్ అయిన చిత్రాలతో బాలయ్య బిజీగా ఉండటంతో రీమేక్ లో నటించడానికి సున్నితంగా తిరస్కరించాడని టాక్.. దీంతో వేరే హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నారు…