వారితో నన్ను పోల్చద్దు … సాయిపల్లవి

వారితో నన్ను పోల్చద్దు ... సాయిపల్లవి

0
93

తెలుగే కాదు ఎక్కడ చిత్ర పరిశ్రమలో అయినా అవకాశాలు వస్తే ప్రతీ సినిమా చేయడానికి హీరోయిన్ ఒప్పుకోరు.. ఆ చిత్రంలో వారి క్యారెక్టర్ నచ్చాలి అంతేకాని దర్శకుడు చెప్పితే కొన్ని సినిమాలు చేయడానికి అంగీకరించరు ..పలు కారణాలు చెప్పేవారు ఉంటారు. అలాగే ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండే హీారోయిన్ లు చాలా మంది ఉన్నారు.. అలా వారు సినిమాలు పదుల సంఖ్యలో వదులుకున్నవి ఉంటాయి.

ఇక టాలీవుడ్ లో సాయిపల్లవి గురించి చెప్పుకుంటే, ఆమెని పొగిడితే పెద్ద నచ్చదు అని చెబుతుంది.
అందరిలాగా వచ్చిన ప్రతి ఒక్క సినిమాని చేసే తత్త్వం ఆమెది కాదు. సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తుంది. అందుకే ఆమె సినిమాలు తక్కువగా విడుదలవుతుంటాయి. తనకు నచ్చినవి మాత్రమే నటిస్తాను అని మొఖం మీద చెబుతుంది ఆమె.

తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది ఇంటర్వ్యూలో… ఎంత సంపాదించినా రాత్రి నేను ఇంటికి వెళ్ళిన తరువాత మూడుచపాతీలే తింటాను. ఎక్కువ సంపాదిస్తున్నాను కదా అని ఎక్కువ తినలేను కదా…అలాగే నా మనసుకు నచ్చని సినిమాలు ఎలా చేయగలను? ఈ విషయంలో నన్ను మిగతా అందరితో పోల్చడం నాకు నచ్చదు అంటూ చెప్పేసింది, దీంతో అభిమానులు కూడా తమ హీరోయిన్ భలే సమాధానం చెప్పింది అంటున్నారు, అందుకే ఆమెకు యూత్ లో అంత క్రేజ్ ఉంది.