వర్మని పెళ్లి చేసుకునేదాన్ని – టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

వర్మని పెళ్లి చేసుకునేదాన్ని - టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

0
108

సినిమా పరిశ్రమలో వర్మ పై చాలా మందికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.. ఈ ప్రపంచంలో తనకి నచ్చిన విధంగా బతికే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వర్మ అని అంటారు, అయితే ఆయన సినిమాలు కూడా ఇప్పుడు జోరు పెంచారు.. తాజాగా ఫిదా సీత ఆన్ ది రోడ్ నటి గాయత్రి గుప్తా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి అనేక వ్యాఖ్యలు చేసింది, అలాగే గాయత్రి గుప్తా కూడా దీనిపై స్పందించి చాలా మందికి ఈ సమస్య ఉంది అని చెప్పింది, అయితే ఇలా మీటూ ఉద్యమం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం వల్లే తనకు అవకాశాలు రాలేదని తాజాగా ఇంటర్ల్యూలో చెప్పింది గాయత్రిగుప్తా.

డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ తనకు ఐస్క్రీమ్2లో అవకాశం ఇచ్చారని.. ఆయనతో మారథాన్లో పాల్గొన్నట్లే ఉంటుందని చెప్పిన ఈమె.. ఆర్జీవీ అంటే తనకు ఇష్టం అని చెప్పింది, అయితే వర్మ నా కంటే చాలా పెద్దవారు లేకపోతే కచ్చితంగా ఆయన్ని పెళ్లి చేసుకునే దాన్ని అని చెప్పింది ఆమె.