దేశవ్యాప్తంగా ఎన్నో అంచానాలతో విడుదలైన ‘ ఆర్ఆర్ఆర్’ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలు కొట్టింది. చాలా వరకూ పాజిటివ్ రివ్యూలే వచ్చాయి.ఈ సినిమా కలెక్షన్ల మోత మోగించింది.ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైన ట్రిపుల్ ఆర్ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మళయాళంలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. తొలి రోజే వందల కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త రికార్డులు సృష్టించింది.
ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు శివకార్తికేయన్, ప్రుథ్వీరాజ్ సుకుమారన్, మంచు లక్ష్మీ, సాయిధరమ్ తేజ్ వంటి వారు ప్రశంసలు కురిపించారు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా రాజమౌళిని ప్రశంసించారు. ఈ మూవీపై ఇప్పుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా స్పందించాడు. ట్విటర్ ద్వారా అతడు ట్రిపుల్ ఆర్‌పై తన అభిప్రాయాన్ని చెప్పాడు.
సాధారణంగా కాస్త సెటైరిక్‌గా ట్వీట్లు చేయడం ఆర్జీవీకి అలవాటు. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం సీరియస్‌గానే ప్రశంసలు కురిపించాడు. తనదైన రీతిలో ట్విట్ చేశారు.మూవీతోపాటు రాజమౌళినీ ఆకాశానికెత్తాడు.‘ బాహుబలి చరిత్ర, ట్రిపుల్ ఆర్ చారిత్రాత్మకం. బాక్సాఫీస్ కు మోక్షం కలిగించి వ్యక్తి రాజమౌళి’ అని ట్విట్ చేశారు.