వ‌ర్మ తీస్తున్న సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమృత‌

వ‌ర్మ తీస్తున్న సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమృత‌

0
89

ప్ర‌ణ‌య్ అమృత ప్రేమ చివ‌ర‌కు హ‌త్య‌కు కార‌ణం అయింది అమృత తండ్రి మారుతీ రావు ఏకంగా ప్ర‌ణ‌య్ ని దారుణంగా హ‌త్య చేయించాడు, చివ‌రకు ఆత్మ‌హ‌త్య చేసుకుని ఇటీవ‌ల మ‌ర‌ణించాడు, అయితే ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా , రామ్ గోపాల్ వ‌ర్మ‌, అమృత జీవితంలో జ‌రిగిన అంశాల‌తో మర్డర్ సినిమాని అనౌన్స్ చేశారు.

ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడంతో మరోసారి ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. దీనిపై అమృత కూడా రియాక్ట్ అయింది, ద‌ర్శ‌కుడు వ‌ర్మ విడుదల చేసిన మర్డర్ ఫస్ట్‌లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ కలిగిందని అమృత తెలిపింది.

ఓ ప‌క్క తండ్రి భ‌ర్త దూరం అయ్యారు, ఈ స‌మ‌యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డంతో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నా అని దీనిని ఎదుర్కొనేంత శక్తి తనకు లేదని చెప్పింది అమృత. ప్రశాంతంగా బతుకుతున్న నా జీవితాన్ని బజారున పడేసే ప్రయత్నమే ఇది అని, కనీసం ఏడ్చేందుకు కూడా కన్నీళ్లు రావడం లేదని ఆమె అంటోంది. తన సినిమా కోసం వర్మ లాంటి ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని అస్సలు ఊహించలేదని తెలిపింది. మ‌రి ఈ సినిమాపై పూర్తిగా వివరాలు ఇంకా వ‌ర్మ తెలియ‌చేయ‌లేదు.