Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..

-

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ జాన్(Baby John)’. ఈ సినిమాలో వరుణ్ ధావన్(Varun Dhawan) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని కలీస్ డైరెక్ట్ చేస్తుండగా.. డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. వచ్చిన అతి కొద్ది సమయంలోనే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఎమోషన్, ఎంటర్‌టైన్మెంట్, యాక్షన్, డ్రామాలతో ఫుల్ ప్యాకేజీగా రానుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా పక్కాగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్ చూస్తే సినిమా ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. దాంతో సమానంగానే డ్రామా, రొమాన్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతి అంశంపై కూడా సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తున్నాయి. బాలీవుడ్ కీర్తి సురేష్.. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అమ్మడి అభిమానులు బల్లగుద్ది చెప్తున్నారు.

ఈ మూవీలో జాకీ ష్రాఫ్, వామికా గబ్బి, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ థియేటర్స్‌లో విడుదల కానుంది. మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా(Baby John) అధిగమిస్తుందో లేదో చూడాలి. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి..

Read Also: ‘ఆస్తులపై ఎప్పుడూ ఆశపడలేదు.. అవన్నీ అబద్దాలే..’
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...