Varun Dhawan | అలా జరిగితే చంపేయాలన్నంత కోపం వస్తుంది: ధావన్

-

తండ్రి, కూతురు అనుబంధాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు. కూతురు అదగాలే కానీ ఏదైనా తెచ్చిస్తాడు తండ్రి. తన గారాలపట్టికి చిన్న బాధ కలిగినా తాను తల్లడిల్లుతాడు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కూడా ప్రస్తుతం అదే ప్రేమలో ఉన్నాడు. జూన్‌లో ధావన్-నటాషా(Natasha Dalal) జంటకు కూతురు పుట్టింది. అమెకు లారా అని పేరుపెట్టారు. తాను తండ్రి అయ్యాక తనలో చాలా మార్పు వచ్చిందని ధావన్ అంటున్నాడు. ఆ మార్పుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా నాన్నను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతున్నానని అన్నాడు. గతంలో మా నానేంటి, ఆయన బాధేంటి అనుకునేవాడినని, వాటిని తాను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నానని చెప్పాడు.

- Advertisement -

‘‘మానాన్న ఎంత పని ఉన్నా సమయానికి ఇంటికి వచ్చేసేవాడు. నాతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించేవాడు. కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత, సమయాన్ని కేటాయించేవాడు. అప్పుడు నాకర్థమయ్యేది కాదు. ఈయన బాధేంటి అనుకునేవాడిని. చీటికి మాటికి విసుక్కునేవాడిని. కానీ నేను తండ్రినయ్యాక అన్నీ అర్థమవుతున్నాయి. తండ్రి అయ్యాక ప్రతి ఒక్కరిలో మార్పు తప్పకుండా వస్తుంది. బిడ్డకు అధిక రక్షణ కల్పిస్తాడు. ఎవరైనా బిడ్డను కాస్త బాధపెట్టినా, వారిపై చేయి చేసుకున్నా వాళ్లను చంపేయాలన్నంత కోపం వస్తుంది. నిజంగా.. సీరియస్‌గా చెప్తున్నా.. వాళ్లని చంపేయాలనిపిస్తుంది’’ అని చెప్పాడు. ధావన్(Varun Dhawan) మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read Also: టీమిండియాలో రింకూ సింగ్‌కు అన్యాయం జరుగుతుందా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...