వరుణ్ శివజ్యోతి లలో ఎవరిదీ తప్పు.. !!

వరుణ్ శివజ్యోతి లలో ఎవరిదీ తప్పు.. !!

0
74

బిగ్ బాస్ లో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది..నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ లో ఓ వైపు రాహుల్, శ్రీముఖి మతాల యుద్ధం చేసుకుంటే మరో వైపు శివజ్యోతి, వరుణ్ లతో మాటలతో మతాబులు పేల్చారు.. ఈవారం నామినేషన్‌లో భాగంగా ‘టాఫర్ ఆఫ్ ది హౌస్’ అనే చాలెంజింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్‌కు ఏడు స్థానాలను డిసైడ్ చేశారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ సూచించిన స్థానం తమకు సరైనది కాదని అనిపిస్తే ఎందుకు సరైనది కాదో వివరణ ఇస్తూ.. అందుకుగల కారణాన్ని తెలియజేసి తమకు సరైన ర్యాంగ్ ఏదో వివరించాల్సి ఉంటుంది.

వాళ్లు చెప్పిన వివరణతో ఇంటి సభ్యులు ఏకీభవిస్తే ర్యాంక్‌లు మార్చుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. నెంబర్ 3 స్థానాన్ని వరుణ్ తన భార్యకు త్యాగం చేయడంతో శివజ్యోతి విశ్వరూపం దాల్చింది. నేనూ నంబర్ 3 స్థానంలో ఉంటా అని భార్య, భర్తలతో వైరానికి దిగింది. గేమ్‌ని గేమ్‌లా ఆడకుండా వితికా కోసం మూడో స్థానం ఎలా ఇస్తావ్ అంటూ వరుణ్‌ని ప్రశ్నించింది.

ఈ ముగ్గురి మధ్య చర్చ ముదిరి వాదనగా మారడంతో ఒకర్నొకరు దూషించుకున్నారు. కంత్రీ ఆట ఆడుతుందని వరుణ్ అనడంతో శివజ్యోతి సీరియస్ అయ్యింది. ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని ఎదురుతిరిగింది శివజ్యోతి. కంటెస్టెంట్స్ మధ్య స్థానాల కోసం చర్చ కొలిక్కి రాకపోవడంతో బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం నామినేషన్స్‌కి ఇంటిలో ఉన్న ఏడుగురు వెళ్లినట్టు షాక్ ఇచ్చారు.