Varun Tej | పెళ్ళిపై వరుణ్ తేజ్ హాట్ కామెంట్స్.. కారణం ఏంటో..

-

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej).. పెళ్ళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోకపోతే జీవితమంతా నరకయాతనే అవుతుందంటూ చెప్పాడు. ఇటీవల నటి లావణ్య త్రిపాఠితో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన వరుణ్ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం కీలకంగా మారింది. తన తాజా సినిమా ‘మట్కా(Matka)’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. అందులో మాట్లాడుతూనే పెళ్ళిపై సలహాలిచ్చాడు. పెళ్ళి అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. దీనిని ఒకసారి చేసుకుంటేనే అందంగా ఉంటుందని, ఈ విషయంలో తొందరపడితే ఆ తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుందని అన్నాడు. వరుణ్ నుంచి ఈ మాటలు రావడంతో టాలీవుడ్‌లో సరికొత్త చర్చ మొదలైంది. వరుణ్, లావణ్య(Lavanya Tripathi) మధ్య పెళ్ళి తర్వాత సఖ్యత కుదరడం లేదా? వీరు కూడా విడాకుల బాట పట్టనున్నారా? అన్న చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ వరుణ్ ఏమన్నాడంటే..

- Advertisement -

‘‘సింగిల్‌గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో చాలా సంతోషంగా గడిపాను. వారితో అన్ని విషయాలు పంచుకునేవాడిని. కానీ స్నేహితులు మనతో శాశ్వతంగా ఉండరని కొంతకాలానికి తెలుసుకున్నాను. మన జీవితానికి సంబంధించి ప్రతి విషయాన్ని, విజయాన్ని పంచుకోవడానికి జీవితంలో ఒక భాగస్వామి కావాలి అని తెలుసుకున్నాను. అలా కాని పక్షంలో జీవితం నరకమే అవుతుంది. మేము దాదాపు ఏడేళ్లు రిలేషన్‌లో ఉన్నాం. ఒకరికొకరం సరిపోతామని తెలుసుకున్నాం. పెళ్ళితో ఒక్కటయ్యాం’’ అని వరుణ్(Varun Tej) అన్నాడు. అయితే వరుణ్ ఈ వ్యాఖ్యలతో తనకు పెళ్ళిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడే తప్ప తన వైవాహకి జీవితం చాలా బాగుందని సన్నిహితులు స్పష్టతనిచ్చారు.

Read Also:  గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...