వరుణ్-లావణ్యల పెళ్లిలో మెగా హీరోల ఫొటో వైరల్..

-

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Varun Tej Lavanya Tripathi) వివాహం బుధవారం ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల బంధువులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వరుణ్-లావణ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గ్రాండ్‌గా జరిగిన ఈ పెళ్లి వేడుకలో మెగా హీరోలందరూ సందడి చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోలో పెళ్లి జంటతో పాటు చిరు, పవన్, చెర్రీ, బన్నీ, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నాగబాబు ఉన్నారు.

- Advertisement -

Varun Tej Lavanya Tripathi

 

ఇక మెగాస్టార్ కూడా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. ‘‘అలా వారు ప్రేమతో నిండిన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. నవతారల దంపతులకు తారల శుభాకాంక్షలు!’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక నవంబర్ 5న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌నలో వరుణ్-లావణ్యల(Varun Tej Lavanya Tripathi) రిసెప్షన్ వేడుక గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Varun Tej Lavanya Tripathi

 

2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడిన వీరు.. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. తమ అభిరుచులు కలవడంతో స్నేహం ప్రేమగా మారిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తమ లవ్‌స్టోరీని చెప్పాడు.

Read Also: అదరగొడుతున్న భారత్ ఆటగాళ్లు.. పీకల్లోతు కష్టాల్లో లంకేయులు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ముగిసిన ప్రచార ఘట్టం.. మూగబోయిన మైకులు..

Telangana Elections |తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింది. గత నెలన్నరగా ప్రతి...

తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ వీడియో సందేశం..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ ప్రజలకు...