నవీన్ చంద్ర మంచి నటుడు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.. తమిళ భాషలో నటుడిగా మంచి పేరు వచ్చింది, అలాగే అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక హీరోగా వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అవిచేస్తూ తనలో ఉన్న ప్రతినాయకుడి క్యారెక్టర్ ని కూడా జనాలకి చూపించి ఆ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుంటున్నాడు.
అరవింద సమేత సినిమాలో ఆయన చేసిన విలన్ రోల్ మంచి పేరును తెచ్చిపెట్టింది.ఇక తమిళ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి, తాజాగా ఆయనకు టాలీవుడ్ లో మరో మంచి ఆఫర్ వచ్చింది అని తెలుస్తోంది. ఆయన వరుణ్ తేజ్ సినిమాలోను విలన్ గా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమా చేస్తున్నాడు. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అయితే ఆయనతో పోటీ అంటే కచ్చితంగా విలన్ గా బాక్సర్ పాత్ర చేయాలి అందుకే నవీన్ ని తీసుకోవాలి అని అనుకుంటున్నారు… నవీన్ మంచి బాక్సింగ్ ఆటగాడు, ఇక ఆయనని సినిమాలో తీసుకోవాలి అని చూస్తున్నారట, ఈ సినిమా జూలై 30వ తేదీన విడుదల కానుంది.