భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన బిగ్ బాస్..!!

భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన బిగ్ బాస్..!!

0
91

బిగ్ బాస్.. తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో.. మొదట్లో చప్పగా సాగిన ఈ షో ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.. ఈ షో ముగియడానికి ఇంకా నెల టైం ఉండడంతో కంటస్టెంట్స్ చాల జాగ్రత్తగా ఈ గేమ్ ను ఆడుతున్నారు.. నిన్నటి ఎపిసోడ్‌లో మహేశ్‌, రాహుల్‌కు గొడవ జరగగా నేడు వరుణ్‌, వితిక లకు భేదాభిప్రాయాలు వచ్చినట్టు కనిపిస్తోంది. రాళ్లు సేకరించే క్రమంలో బాబా, వితిక ఒకరినొకరు తోసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తోపులాటలో వితిక కిందపడింది.

దీంతో చూస్కొని ఆడొచ్చు కదా అంటూ వితిక అసహనంతో ఊగిపోయింది. ‘ఇది టాస్క్‌.. అలానే జరుగుతుంది, టాస్క్‌లో దెబ్బలు తగులుతాయి’ అంటూ వరుణ్‌, వితిక పై ఫైర్‌ అయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాటే జరిగింది. ఆడితే ఆడు, లేకపోతే లేదంటూ వితికపై మండిపడ్డాడు.

వితికపై ఈగ కూడా వాలనివ్వని వరుణ్‌.. ఎందుకు తనపై అంతలా సీరియస్‌ అయ్యాడు? అసలు వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుంది అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. ​కాగా ఇప్పటికే రాహుల్‌ నామినేట్‌ అవగా, నేటి ఎపిసోడ్‌లో ఎవరు నామినేషన్‌ జోన్‌లోకి రానున్నారో చూడాలి