వెంకటేశ్ .. వరుణ్ తేజ్- రవితేజ కొత్త సినిమా

వెంకటేశ్ .. వరుణ్ తేజ్- రవితేజ కొత్త సినిమా

0
104

అనిల్ రావిపూడి దర్శకత్వంలో గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత విజయం సాధించిందో తెలిసిందే ..ఇందులో వెంకటేష్ అలాగే వరుణ్ తేజ నటనకు సినిమా కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, దీంతో ఈ సినిమా వినోదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది..

ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి అనిల్ రావిపూడి రంగంలోకి దిగాడు. ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమా చేస్తారు అని గతంలో వార్తలు వినిపించాయి, తాజాగా ఆయన ఈ సినిమాలో మరో కొత్త హీరోని యాడ్ చేస్తారు అని తెలుస్తోంది.

ఎఫ్ 2 సినిమాలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. రాజేంద్రప్రసాద్ నటించారు. ఎఫ్ 3లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతో పాటు రవితేజ కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి, అయితే తాజాగా డిస్కోరాజా విడుదల అయింది, ఇప్పుడు రవితేజ మరో చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు, అయితే ఇందులో నిజంగా రవితేజ ఉన్నారా లేదా అనేది తెలియాలి అయితే
గతంలో అనిల్ రావిపూడి – రవితేజ కాంబినేషన్లో వచ్చిన రాజా ది గ్రేట్ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్ లో ఎఫ్ 3 చేస్తారేమో చూడాలి.