వెంకటేశ్ సినిమా విడుదల తేది వాయిదా

వెంకటేశ్ సినిమా విడుదల తేది వాయిదా

0
80

ఈ కరోనా వల్ల దాదాపు అన్ని సినిమా హాళ్లు మూతపడ్డాయి, ఇక కొత్త సినిమాలు పట్టాలెక్కడం లేదు సెట్స్ పై ఉన్న సినిమాలు కూడా షూటింగ్ నిలిపివేశారు…అయితే ఈ సమ్మర్ లో పెద్ద పెద్ బడ్జెట్ సినిమాలు భారీ నిర్మాణ సినిమాలు విడుదల తేదీలు ముందుగానే ప్రకటించారు… అయితే మళ్లీ కరోనా కేసులు ఈ సెకండ్ వేవ్ లో పెరగడంతో అన్ని సినిమాలు వాయిదా వేసుకుంటున్నారు.

 

ఇక షూటింగ్ వర్క్ కూడా చాలా వరకూ ఆగిపోయాయి… తాజాగా వెంకటేష్ సినిమా నారప్ప కూడా రిలీజ్ డేట్ వాయిదా పడింది.. ముందుగా ఈ సినిమాని మే 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.

 

తమిళంలో ధనుశ్ కి హిట్ తో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టిన అసురన్ సినిమాకి ఇది రీమేక్. ఇక పరిస్దితులు సాధారణం అయ్యాక సినిమా రిలీజ్ డేట్ పై స్పష్టత రానుంది, ఇక ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది తెలుగులో కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.