టాలీవుడ్ లో బెస్ట్ కామెడీ కుటుంబ కధా చిత్రం లిస్ట్ లో కచ్చితంగా ఎఫ్ 2 ఉంటుంది, అయితే ఇప్పుడు దీనికి కంటిన్యూగా ఎఫ్ 3 రాబోతోంది, ఇందులో కూడా వెంకీ వరుణ్ తేజ్ సందడి చేయనున్నారు, అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మరో హీరో కమ్ కమెడియన్ నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.
ఆయన ఎవరో కాదు మన కమెడియన్ మనలో ఒకరు తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చిన భీమవరం బుల్లోడు అందాల రాముడు సునీల్, ఇప్పటికే మంచి కామెడీ పాత్రలు వస్తే ముందు సునీల్ పేరు వినిపిస్తుంది, అయితే సునీల్ తాజాగా ఎఫ్ 3లో నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
హీరో నుంచి మళ్లీ కమెడియన్గా యూటర్న్ తీసుకున్న సునీల్ అరవింద సమేత, అల వైకుంఠపురములో, చిత్రలహరి వంటి సినిమాల్లో నటించారు. ఇక పుష్పలో కూడా నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి…అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే ఎఫ్3లో ఆయనకు ఛాన్స్ ఉంది అని తెలుస్తోంది. సో పాత్ర ఏదైనా సునీల్ ఉంటే సినిమాకి ఆ కిక్కే వేరు అంటున్నారు అభిమానులు.