బాలీవుడ్ రీమేక్ లో వెంకీ ఉన్నాడా లేడా..!!

బాలీవుడ్ రీమేక్ లో వెంకీ ఉన్నాడా లేడా..!!

0
87

ప్రస్తుతం వెంకీ మామ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్న వెంకీ అప్పుడే తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తున్నాడు.. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్న వెంకీ బాలీవుడ్ సినిమా రీమేక్ లో నటిన్చాబోతున్నరంటు అప్పట్లో వార్తలు రాగ ఇప్పుడు ఆ చిత్రంలో నటించాదబికి వెంకటేష్ సిద్ధంగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి..

అయితే తాజాగా బాలీవుడ్ లో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ మరియు టబు హీరోహీరోయిన్లుగా నటించి సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. సురేష్ బాబు స్వయంగా ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడు. 50 ఏళ్ళు ఉన్న ఒక వ్యక్తి తన కంటే వయసులో చాలా చిన్న అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తే బాగుంటుందని సురేష్ బాబు అనుకున్నాడట. కానీ వెంకీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తనకు సెట్ అవ్వదని నిర్ణయించుకున్న వెంకటేష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. మరి సురేష్ బాబు ఇప్పుడు ఈ సినిమాని ఏ హీరోతో చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.