”ఆహా’ స్పెషల్ ప్రోగ్రాం..హోస్ట్ గా వెంకటేష్!

0
121

ఇప్పటికే స్టార్ హీరోలంతా బుల్లితెరపై సందడి చేస్తున్నారు. నాగార్జున, ఎన్టీఆర్, నాని, బాలకృష్ణ వంటి స్టార్స్ హెస్ట్ గా వ్యవహరించారు. ఇప్పటికే ఆహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ సందడి చేస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకు హెస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ షో భారీ సక్సెస్ సాధిాంచింది. ఇదిలా ఉంటే తాజాగా విక్టరీ వెంకటేష్ హెస్ట్ గా మరో షోకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటి ఆహా కోసం వెంకటేష్ హెస్ట్ గా ఓ స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం వెంకీతో ఇదే విషయంపై చర్చిస్తున్నారట మేకర్స్. మరీ ఇందుకు వెంకటేష్ ఒప్పుకున్నారా ? లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న ఈ ఫన్ రైడ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో భాగమవుతున్నారు వెంకటేష్.