వెంకీ ఫార్ములా ఫాలో అవనున్న బెల్లంకొండ

వెంకీ ఫార్ములా ఫాలో అవనున్న బెల్లంకొండ

0
105

తెలుగు చిత్ర పరిశ్రమలో బెల్లంకొండ శ్రీనివాస్ అంటే తెలియని వారు ఉండరు. కథ పరంగా మంచి వాటినే ఎంపిక చేసుకున్నా…అవి థియెటర్ల దగ్గర మిశ్రమ ఫలితాలు చూపించేవి. తాజాగా విడుదలైన రాక్షక్షుడు మంచి ఫలితాలు అందుకోవడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తంచేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ చిత్రాలు బిజినెస్ పరంగా, ఓపెనింగ్స్ పరంగా ప్రూవ్ చేసుకున్నాడు.

ఈసారి “రాక్షసుడు” అనే రీమేక్ సినిమాతో నటుడిగానూ మంచి మార్కులు వేయించుకున్నాడు.ఇంతకుముందు నటించిన సినిమాలు తనకు ఎలాంటి పేరు తీసుకురాలేదు. రీమేక్ చిత్రాన్ని ఎక్కడా చెడగొట్టకుండా దర్శకుడు రమేష్ వర్మ తీశారు. మా అబ్బాయి నడిచిన సినిమాల్లో కొన్ని సినిమాలు తెలుగులో ఆర్థికంగా నష్టపోయినా హిందీలో మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ సినిమా నుంచి అతను విక్టరీ వెంకటేష్ ఫార్మూలాని ఫాలో అవుతాడట.

ఈ విషయాన్ని ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ ప్రకటించాడు. వెంకటేషు సాధించిన విజయాల్లో ఎక్కువగా రీమేకులే ఉన్నాయి. తమిళ సినిమాలను యాజిటీజుగా తెలుగులో తీయించేవాడు వెంకీ. తన కొడుకు కూడా ఈ సినిమా విషయంలో అలా చేసి విజయం సాధించడంటున్నారు బెల్లంకొండ సురేష్, అంతే కాదు, తన కొడుక్కి హిందీ డబ్బింగ్ మార్కెట్ బాగుంది కాబట్టి త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ చేయిస్తాను అంటున్నాడు.

మా అబ్బాయికి రాక్షసుడు మంచి పేరు తీసుకొచ్చింది.డబ్బింగ్ మార్కెట్ లో మా అబ్బాయి నెంబర్ వన్ హీరో. అందుకే త్వరలోనే బాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ మూవీ ఒకటి దిల్ రాజు బ్యానర్లో ఉంటుంది అని చెప్పారు ఇదే కాక మరో సంచలన విషయాన్ని కూడా ప్రకటించారు. అదేమిటనుకున్నారా.. మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్ కు 10 లక్షలు ఇస్తానని ప్రకటించారు బెల్లంకొండ సురేష్ తెలిపారు.