వెంకీ మామ క్లైమాక్స్ ట్విస్ట్.. షాక్ లో వెంకీ అభిమానులు..!!

వెంకీ మామ క్లైమాక్స్ ట్విస్ట్.. షాక్ లో వెంకీ అభిమానులు..!!

0
103

వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వెంకీమామ.. డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా లో రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ముందుగా దసరా కానుకగా రిలీజ్ చేద్దామనుకున్న సినిమా ని డిసెంబర్ లో చేయడానికి కారణం ఆ టైం లో సినిమా రిలీజ్ కి ఎక్కువగా ఉండడమే అని తెలుస్తుంది..

ఇకపోతే ఈ సినిమాకి యాంటీ క్లైమాక్స్ డిజైన్ చేశారట దర్శకుడు.. అంటే మిలిటరీలో పని చేసిన వెంకీ మామకు భావోద్వేగాలతో కూడిన బరువైన ముగింపు ఇచ్చారట. ఇంతవరకు వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నడూ చివర్లో చనిపోయే పాత్ర చేయలేదు. మరి ఇప్పుడు చేస్తే అభిమానులు ఒప్పుకుంటారా అనేది అనుమానమే. పైగా వెంకీని అమితంగా ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది రుచించకపోవచ్చు. మరి బాబీ ఏవిధంగా వారిని కన్విన్స్ చేస్తారో చూడాలి..