వారితో వెంకీమామ తట్టుకోగలడా..!!

వారితో వెంకీమామ తట్టుకోగలడా..!!

0
95

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం వెంకీమామ.. పాయల్ రాజ్ పుత్, రాశికన్నా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదట నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తరువాత సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ చేయాలని ముందుగా ఫిక్స్ అయ్యారు. అంటే.. జనవరి 14 న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, డేట్ ను మరలా అనూహ్యంగా మార్చినట్టు తెలుస్తోంది.

వెంకిమామ సినిమా జనవరి 11 వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. అయితే ఈ డేట్ ను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. జనవరి 10 వ తేదీన రజినీకాంత్ దర్బార్ రిలీజ్ కాబోతున్నది.

ఈ మూవీ రిలీజైన మరోసారి రోజున వెంకిమామ, ఆ మరుసటి రోజున మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. డేట్స్ అటు ఇటు మారుతున్నాయిగాని, సంక్రాంతి నుంచి మాత్రం ఈ సినిమాలు ఏవి తప్పుకోవడం లేదు. మరి సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల్లో ఏ సినిమాలు హిట్ అవుతాయో.. ఏవి ఫట్ అంటాయో చూడాలి.