హాస్యనటుడు వేణుమాధవ్ కు అస్వస్తత..!!

హాస్యనటుడు వేణుమాధవ్ కు అస్వస్తత..!!

0
132

ప్రముఖ హాస్యనటుడు హీరో వేణుమాధవ్ ఆరోగ్యం తీవ్రంగా మారింది.. దీంతో ఆయనను సికింద్రాబాద్ యశోదా హాస్పటల్‌లో చేర్పించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు. గతకొంత కాలంగా అయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు.

అందుకే అయన సినిమా లకు కూడా దూరంగా ఉన్నారు.. వెండితెరపై ఎన్నో నవ్వుల పువ్వులు పూయించిన వేణుమాధవ్ సినిమా లకి దూరమై ఫ్యామిలీ తోనే ఉన్న కాలేయ వ్యక్తి ఆయన్ని బయటకి రానివ్వకుండా చేసింది.. దీనికి తోడు కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది.

పలుమార్లు సోషల్ మీడియా లో కనిపించినా ఈమధ్య అసలు అందులో కూడా కనిపించట్లేదు.. అందరిని తెగ నవ్వించిన ఆయన ఆరోగ్యం మళ్ళీ కుదుటపడి సినిమాల్లోకి రావాలని కోరుకుందాం..